జిల్లా ఖనిజ ట్రస్టు నిధుల సేకరణ తేది పై తీర్పు వెలువరించిన అత్యున్నత న్యాయస్థానం

District Mineral Foundation Trust Contributions Shall be made w.e.f. 17.09.2015 onwards


భారత కేంద్ర ప్రభుత్వం, గనులు మరియు ఖనిజములు (అభివృద్ధి మరియు నియంత్రణ) చట్టం, 1957 నకు పలు కీలక సవరణలు చేస్తూ, "గనులు మరియు ఖనిజములు (అభివృద్ధి మరియు నియంత్రణ) సవరణ చట్టం, 2015" ను తేది:12.01.2015 నుండి అమలులోకి తీసుకొనిరావడమైనది. ఇట్టి సవరించబడిన చట్టం నందలి విభాగము 9(B) ను అనుసరించి, రాష్ట్ర ప్రభుత్వాలు మైనింగ్ సంబందిత కార్యకలాపాల వలన ప్రభావితమైన ప్రాంతాల అభివృద్ధి మరియు సంక్షేమం కొరకు ఆయా జిల్లాలలో "జిల్లా ఖనిజ ట్రస్టు"ను ఏర్పాటు చేసుకొనవలసి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం వారిచే జారీ చేయబడిన చట్టంలోని సవరణలను అనుసరించి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలుత ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య. 52, తేది: 21.08.2015 మరియు ఉత్తర్వుల సంఖ్య. 53, తేది:21.08.2015 ద్వార "జిల్లా ఖనిజ ట్రస్టు" ను నెలకొల్పుతూ ఉత్తర్వులు జారీచేయడమైనది. తదనంతరం, అట్టి ఉత్తర్వులను పూర్తిగా రద్దు పరుస్తూ, ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య. 3, తేది:20.01.2016 ద్వార "తెలంగాణ రాష్ట్ర జిల్లాల ఖనిజ ట్రస్టు నియమావళి, 2015" ను రూపొందించడమైనది. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య. 4, తేది: 20.01.2016 ద్వార "జిల్లా ఖనిజ ట్రస్టు" తేది:12.01.2015 నుండి అమలులో ఉంటుందని ఉత్తర్వులు జారీ చేయడమైనది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే జారీ చేయబడిన "జిల్లా ఖనిజ ట్రస్టు" ఏర్పాటు మరియు వాటి అమలు తేదిల పై ఆగ్రహించిన కొందరు కౌలుదారులు సుప్రీం కోర్టును ఆశ్రయించడమైనది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన అత్యున్నత ధర్మాసనం, వాదప్రతివాదనలు విన్న అనంతరం తేది: 13.10.2017 రోజున తుది తీర్పును వెలువరించడమైనది. అట్టి తీర్పును అనుసరించి, కేంద్ర ప్రభుత్వం వారిచే తొలుత తేది: 12.01.2015 రోజున జారీ చేయబడిన "గనులు మరియు ఖనిజములు (అభివృద్ధి మరియు నియంత్రణ) సవరణ చట్టం, 2015" నందు "జిల్లా ఖనిజ ట్రస్టు" ఏర్పాటుపై ఆదేశాలు ఉన్నప్పటికీ, ఎంత మొత్తాన్ని విరాళాల రూపేణా సేకరించాలనే అంశంపై పూర్తి స్పష్టత లేనందున, ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం వారిచే తేది: 17.09.2015 రోజు జారీ చేయబడిన, గనులు మరియు ఖనిజములు (జిల్లా ఖనిజ ట్రస్టు విరాళాల) నియమావళి, 2015 నందు స్పష్టముగా రాయల్టీపై 30% శాతాన్ని చెల్లించవలసినదిగా ఆదేశాలు ఉన్నందున, అట్టి తేదిని పరిగణలోకి తీసుకొని తేది: 17.09.2015 నుండి కౌలుదారులు జిల్లా ఖనిజ ట్రస్టుకు రాయల్టీ పై అదనంగా 30% శాతాన్ని జిల్లా ఖనిజ ట్రస్టుకు చెల్లించ వలసినదిగా ఆదేశించడమైనది. ఇందుకుగాను, కౌలుదారులకు తేది: 31.12.2017 వరకు గడువు ఇస్తూ, అట్టి గడువులో, చెల్లించని యడల 15% వడ్డీని విధించమని ఆదేశించడమైనది. ఎవరైనా, తేది:12.01.2015 నుండే ట్రస్టు నిధులు చెల్లించినట్లయితే, అట్టి అదనపు మొత్తాన్ని వారికి తిరిగి ఇవ్వకుండా, వారు  భవిష్యత్తులో చెల్లించబోయే మొత్తంలో సర్దుబాటు చెయ్యమని ఆదేశాలు జారీ చేయబడినది.

Download:

Supreme Court Judgement
GSR No. 715(E), Dt: 17.09.2015

జిల్లా ఖనిజ ట్రస్టు నియమావళి, 2015 నకు పలు సవరణలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు సంఖ్య. 83, తేది: 08.11.2017 ద్వార జిల్లా ఖనిజ ట్రస్టు నియమావళి, 2015 నకు పలు సవరణలు చేస్తూ, ట్రస్టు ద్వార చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ యోజన పథకం క్రింద జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ సమితి (దిశ) ద్వార పర్యవేక్షణ చేయుటకు ఆదేశాలు జారీచేయడమైనది. 

ప్రభుత్వ ఉత్తర్వులో కొన్ని ముఖ్యాంశాలు:
1. ట్రస్టు ద్వార జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయ పరచడానికి మరియు పర్యవేక్షణ చేయడానికి, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలనే కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఖనిజ ట్రస్టు నియమావళి, 2015 నకు పలు సవరణలు చేయడమైనది.

2. ట్రస్టు ద్వారా జరిగే అన్ని అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ సమితి (దిశ) ద్వార పర్యవేక్షణ చేయబడును. ఈ సమితికి స్థానిక పార్లమెంటు సభ్యుడు చైర్మన్ గా వ్యవహరిస్తారు.

3. ఒక వేళ ఒక జిల్లా నుండి ఒకరి కంటే ఎక్కువ పార్లమెంటు సభ్యులు ఎన్నుకోబడినట్లయితే, సీనియర్ పార్లమెంటు సభ్యుడు చైర్మెన్ గా, ఇతర సభ్యులు కో-చైర్మన్ గా వ్యవహరిస్తారు.

4. ఒక వేళ సీనియారిటి విషయంలో ఇద్దరు సభ్యులు సమాన స్థాయి ని కలిగి ఉన్నట్లయితే, భౌగోళికంగా ఆ జిల్లాలో ఎవరి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గం పెద్దగా ఉంటుందో ఆ సభ్యుడు చైర్మన్ గా వ్యవహరిస్తారు.

5. అట్టి “దిశ” కమిటీకి సంబందిత జిల్లా కలెక్టరు మెంబర్–సెక్రటరీ గా వ్యవహరిస్తారు. కొన్ని అసాధారణ పరిస్థితులలో సంబందిత జిల్లా కలెక్టర్ కు, ముఖ్య కార్యనిర్వాహణ అధికారి, జిల్లా పరిషత్ లేదా అదనపు జిల్లా మెజిస్ట్రేటు లను మెంబర్-సెక్రెటరీ గా నియమించే అధికారం కలదు.

6. జిల్లాలో గల ఎన్నుకోబడిన అందరు శాసన సభ్యులు, మునిసిపల్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్, ముఖ్య కార్య నిర్వాహణ అధికారి, జిల్లా పరిషత్తు, ప్రాజెక్టు డైరెక్టరు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, లీడ్ బ్యాంకు అధికారి,  చైర్మన్ మరియు ఇతర పార్లమెంటు సభ్యులతో ఎన్నుకోబడిన ప్రభుత్వేతర సంస్థ ప్రతినిధి, పోస్టల్ శాఖ పర్యవేక్షణ అధికారి మరియు ఇతరలు, "దిశ" కమిటీలో సభ్యులుగా ఉంటారు.

7. కేంద్ర ప్రభుత్వం వారిచే రూపొందించబడిన సుమారు (28) పథకాల అమలు తీరును “దిశ” కమిటీ పర్యవేక్షణ చేస్తుంది.తెలంగాణ రాష్ట్ర ఇసుక త్రవ్వకాల నియమావళి, 2015 నకు సవరణలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు సంఖ్య. 84, తేది: 09.11.2017 ద్వార తెలంగాణ రాష్ట్ర ఇసుక త్రవ్వకాల నియమావళి, 2015 నకు సవరణ చేస్తూ, పట్టాభూములలో మేట వేసిన ఇసుకను తొలగించుగొనుటకు గాను పట్టాదారునికి క్యూబిక్ మీటర్ ఒక్కంటికి గరిష్టంగా రూ||100/- చెల్లించవలసినదిగా ఆదేశాలు జారీ చేసింది.తెలంగాణ రాష్ట్ర చిన్న తరహ ఖనిజ నియమావళి, 1966 నకు పలు సవరణలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

          తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు సంఖ్య. 48, తేది: 26.07.2017 ద్వార తెలంగాణ రాష్ట్ర చిన్న తరహా ఖనిజ నియమావళి, 1966 నకు పలు సవరణలు చేయడమైనది. ఇంతకు  ముందు ఉత్తర్వు సంఖ్య . 37, తేదీ: 26.07.2016 ద్వార కొన్ని సవరణలు చేసినప్పటికిను, వాటిని పూర్తిగా రద్దుపరుస్తూ ఈ నూతన ఉత్తర్వులను అమలులో తీసుకొని వచ్చింది. వాటిలో కొన్ని ప్రధానమైన సవరణలు:

1. చిన్న తరహా ఖనిజములు వర్గీకరణ
2. చిన్న తరహా ఖనిజములు త్రవ్వకాలకు క్వారీ ప్లాన్ తప్పనిసరి 
3. తక్షణ అవసరాల కొరకు తాత్కాలిక అనుమతుల మంజూరి
4. క్వారీ రెన్యూవల్ పొందుటకొరకు నూతన నియమ నిబంధనలు - కనీసం (12) మాసాల ముందే క్వారీ రెన్యూవల్ అనుమతుల కొరకు దరఖాస్తు

పై విషయాలకు సంబందించిన పూర్తి వివరాలను ఈ క్రింది జతపరచబడిన PDF ఫైల్ లో పొందగలరు.

Downloads:


మైనింగ్ మరియు క్వారీ లీజుల హద్దుల గుర్తిపునకు DGPS సర్వే

తెలంగాణ రాష్ట్రంలోని మైనింగ్ లీజుల మరియు క్వారీ లీజుల హద్దులను మరింత పరిష్ఠ పరచడానికి గనులు మరియు భూగర్బ శాఖ సన్నాహక చర్యలు చేపట్టింది. భారత కేంద్ర ప్రభుత్వం వారిచే జారీచేయబడిన, ఖనిజ రాయితీ (రెండవ సవరణ) నియమావళి,2014 (GSR No. 710 (E), Dated: 08.10.2014) ను అనుసరించి, ప్రతి మైనింగ్ లీజు యొక్క హద్దులను Total Station మరియు Differential Global Positioning System ద్వార గుర్తించవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఆధునాతనమైన Cartosat-2 మరియు LISS-IV వంటి శాటిలైట్ ల సహాయంతోDGPS / ETS ద్వార రాష్ట్రంలో గల అన్ని మైనింగ్ లీజులు, క్వారీ లీజులు, మైనింగ్ బ్లాక్ ల యొక్క సరిహద్దులను మరియు వాటి చుట్టూ 500 మీటర్ల వ్యాసార్థంలో ఉన్న ఇతర శాశ్వత గుర్తింపు చిహ్నాలను గుర్తించడానికి (08) సర్వే సంస్థలకు అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేయడమైనది.


Download:
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న "డబుల్ బెడ్ రూమ్" ఇళ్ల నిర్మాణం వేగవంతంగా జరగడానికి, ఇసుకను ఉచితంగా అందించాలనే ఉద్దేశ్యంతో, ప్రభుత్వం ఉత్తర్వు సంఖ్య. 11, తేదీ: 13.02.2017 ద్వార, బలహీన వర్గాల గృహ నిర్మాణానికి అవసరమగు ఇసుక పై  సీనరేజు చార్జీల చెల్లింపును పూర్తిగా మినహాయించడమైనది. 

ప్రభుత్వ ఉత్తర్వు ప్రతిని ఇచ్చట పొందగలరు.
 ఖనిజము వెలికితీతలపై నూతన చట్టాల ఏర్పాటు

District Mineral Foundation (Trust) Rules, 2015

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గనుల నుండి ఖనిజముల వెలికితీత వలన ఏర్పడే సమస్యల పైన ప్రత్యేక దృష్ట్రి సారించింది. మానవాళి మనుగడకు ఖనిజముల వెలికితీత అత్యంత ఆవశ్యకము అయినప్పటికీ, ఖనిజములు వెలికితీయడం వలన ప్రభావితం అయ్యే ప్రాంతాల పునరుద్దరణకు మరియు పర్యావరణ పరిరక్షణకు పలు నూతన చట్టాలను, నియమ నిబంధనలు ఏర్పాటు చేయడమైనది. ఈ నియమ నిబంధనల అనుసరించి ప్రతి క్వారీ కౌలుదారుడు, వారి క్వారీ ప్రాంతాల అభివృద్ధికి కొరకు కొంత మొత్తాన్ని ప్రభుత్వ నిధికి జమ చేయవలసి ఉంటుంది. 

<<< Download >>>

ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు (90) రోజుల శిశు సంరక్షణ సెలవులు

      పదవ వేతన సంఘం సిఫార్సుల మేరకు, తెలంగాణ ప్రభుత్వం  సంఖ్య. 209, తేది: 21. 11. 2016 ద్వార ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు (90) రోజుల శిశు సంరక్షణ సెలవులు మంజూరు చేయడమైనది. వాటిలో కొన్ని ముఖ్యాంశాలు:

1. మహిళా ఉద్యోగస్తులు వారి సర్వీసు కాలంలో తమ ఇద్దరి పిల్లల వయస్సు 18 సంవత్సరాలు (దివ్యాంగులు అయినట్లయితే 22 సం||లు) వచ్చే వరకు వారి పరీక్షలు, అనారోగ్యం తదితర కారణాల కొరకు , ప్రతి దఫా (15) రోజులు మించకుండా మొత్తం మూడు మాసాల శిశు సంరక్షణ సెలవును పొందవచ్చును. 

2. శిశు సంరక్షణ  రెగ్యులర్ సెలవులతో సంబంధం లేకుండా ప్రత్యేక లీవు ఎక్కౌంటు లో పొందుపరుస్తూ, అట్టి కాపీని ఉద్యోగి సర్వీసు పుస్తకం లో జతపరచవలెను. 

3. శిశు సంరక్షణ సెలవు హక్కు కాదు. ఇట్టి సెలవు కొరకు సంబంధిత DDO దగ్గర ముందస్తు అనుమతి పొందవలసి ఉంటుంది. 

4. మహిళా ఉద్యోగస్తులు సెలవు కాలపు పూర్తి జీతాన్ని పొందుతారు. 

5. శిశు సంరక్షణ సెలవును సాధారణ సెలవులు, ప్రత్యేక సాధారణ సెలవులతో కాకుండా వేరే సెలవులతో కలిపి వాడుకోవచ్చును. ప్రస్తుతం అమలులో ఉన్న (180) రోజుల మెటర్నిటి  అదనంగా వాటికి కొనసాగింపుగా శిశు సంరక్షణ సెలవును వాడుకోవచ్చు. 

ప్రభుత్వ ఉత్తర్వు కాపీని ఇక్కడ పొందగలరు. 
New DDO Codes and Head of Accounts

తెలంగాణ రాష్ట్రంలో గల గనులు మరియు క్వారీ లీజుదారులు రాయల్టీ / సీనరేజు చార్జీలు మరియు ఇతర రుసుములు చెల్లించుటకు వీలుగా రాష్ట్రం లోని అన్ని జిల్లాలలో గల గనులు మరియు భూగర్భ శాఖ కార్యాలయాల నూతన DDO Code ల వివరాలు క్రింద పట్టిక లో పొందపరచడమైనది. క్వారీలీజుదారులు జిల్లా కేంద్రం లోనే కాకుండా, వారి క్వారీ ప్రదేశం గల జిల్లా పరిధిలోని ఏ ట్రెజరీ ద్వార నైనా రుసుములు చెల్లించుకొనే వెసులుబాటు కలదు.


Telangana State Sand Mining Rules - 2015

The Government have formulated Telangana State Sand Mining Rules, 2015 to regulate mining and transportation of sand in the State of Telangana and the matters connected therewith. The Government Orders and the guidelines issued by the Government can be downloaded from Sand G.Os Tab in Menu / following link...


Amendments to District Mineral Foundation (Trust) Rules, 2015


The Government of Telangana vide G.O.Ms. No. 58, Dt: 04.10.2016 have made amendments to Rules 13.1.3 & 13.1.4.1 of District Mineral Foundation (Trust) Rules, 2015. As per amendment Rues, the Quarry Lease holders for Granite have to pay only 20% contribution towards District Mineral Foundation Trust. The difference amounts paid so far @ 30% shall be adjusted towards future permits. The contribution towards DMFT for Quarry Lease holders other than Granite shall stands same i.e., 30%.


Download here: G.O.Ms. No. 58, Dt: 04.10.2016
Amendments to G.O.Ms. No. 74, Dt: 16.02.2002 regarding issue of No Objection Certificates for lands having mineral wealth


గతంలో ప్రభుత్వం ఉత్తర్వు సంఖ్య. 74, తేది :16.02.2002 ద్వార ఖనిజ నిల్వలు గల భూములను, ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం లాంటి ఇతర అవసరాలకు కేటాయించరాదని, కేవలం మైనింగ్  కొరకు మాత్రమే కేటాయించాలని  ఉత్తర్వులు జారీ చేయడమైనది. అయితే ప్రస్తుతం, ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య. 59, తేది: 04.10.2016 ద్వార పాత ఉత్తర్వులలో కొంత మార్పులు చేసి, ఖనిజ నిలువలు గల భూమిని కూడా విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ ప్రాజెక్టులకు కేటాయించడానికి అనుమతించనైనది. నిరభ్యంతర పత్రం (NOC) కోరుతూ పెండింగ్ లో ఉన్న ధరఖాస్తులపై,  సంచాలకులు, గనులు మరియు భూగర్భ శాఖ వారిని సంప్రదించిన తరువాత అట్టి ధరఖాస్తులపై నిర్ణయం తీసుకోవలసినదిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడమైనది.
 
Download: G.O.Ms. No. 59, Dt: 04.10.2016