Amendments to Telangana State Minor Mineral Concession Rules, 1966.

The Govt. of Telangana have made certain amendments to Telangana State Minor Mineral Concession Rules, 1966 vide G.O.Ms. No. 37, Industries and Commerce (M.I) Dept., Dt:26.07.2016.



Download here: G.O.Ms. No. 37, Dt: 26.07.2016


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా “తెలంగాణ రాష్ట్ర చిన్న తరహ ఖనిజ నియమావళి, 1966” కు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య. 37, తేది: 26.07.2016 ద్వార పలు కీలకమైన సవరణలు చేయడమైనది. 

కొన్ని ముఖ్యమైన సవరణలు:

  • ప్రతీ క్వారీకి Geo-coordinates కూడిన సరిహద్దుల ఏర్పాటు తప్పనిసరి.

  • కొత్తగా క్వారీ పొందుటకు పర్యావరణ అనుమతి (EC), క్వారీ పనిచేయు విధానాన్ని తెలిపే స్వీయ ధ్రువీకృత “క్వారీ ప్లాన్”, క్వారీ పనులు చేసుకోనుట కొరకు కాలుష్య నియంత్రణ మండలి వారి సమ్మతి (Consent for Operation) తప్పనిసరి.

  • ప్రతి లీజుదారుడు వారి యొక్క ప్రస్తుత క్వారీకి కూడా, క్వారీ పనిచేయు విధానాన్ని తెలిపే స్వీయ ధ్రువీకృత “క్వారీ ప్లాన్” ప్రభుత్వ ఉత్తర్వు వెలువడిన నుండి ఆరు నెలలో తప్పనిసరిగా సమర్పించవలసి ఉంటుంది. లేని యడల, ఒక సంవత్సరపు Dead Rent ను అపరాధ రుసుముగా చెల్లించి మరో ఆరు నెలలు గడవు పొందవచ్చును.

  • స్వీయ ధ్రువీకృత “క్వారీ ప్లాన్”, ప్రభుత్వ/శాఖ ఆమోదిత మైనింగ్ ఇంజనీర్ లేదా జియాలజిస్టు ద్వార తయారు చేయబడి సంబందిత ఉప సంచాలకులు, గనులు మరియు భూగర్భ శాఖ వారి ఆమోదం పొందవలసి ఉంటుంది.

  • వివిధ ప్రభుత్వ ఇంజనీరింగు శాఖలలో నిర్మాణ పనులు చేపటుచున్న గుత్తేదారులు కూడ ఇకపై తప్పనిసరిగా క్వారీ లీజు అనుమతి పొందవలసి ఉంటుంది.

  • అట్టి గుత్తేదారులు క్వారీ పొందిన పిదప “సీనరేజు రుసుము మినహాయింపు” రవాణా పత్రములను సంబంధిత సహాయ సంచాలకులు, గనులు మరియు భూగర్భ శాఖ వారి నుండి పొందిన పిదపనే ఖనిజములు రవాణ చేయవలసి ఉంటుంది.

     మరింత సమాచారం... త్వరలో... 

      అడ్మిన్ వాట్సప్ నెం: +91 9502713294.