పదవ వేతన సంఘం సిఫార్సుల మేరకు, తెలంగాణ ప్రభుత్వం సంఖ్య. 209, తేది: 21. 11. 2016 ద్వార ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు (90) రోజుల శిశు సంరక్షణ సెలవులు మంజూరు చేయడమైనది. వాటిలో కొన్ని ముఖ్యాంశాలు:
1. మహిళా ఉద్యోగస్తులు వారి సర్వీసు కాలంలో తమ ఇద్దరి పిల్లల వయస్సు 18 సంవత్సరాలు (దివ్యాంగులు అయినట్లయితే 22 సం||లు) వచ్చే వరకు వారి పరీక్షలు, అనారోగ్యం తదితర కారణాల కొరకు , ప్రతి దఫా (15) రోజులు మించకుండా మొత్తం మూడు మాసాల శిశు సంరక్షణ సెలవును పొందవచ్చును.
2. శిశు సంరక్షణ రెగ్యులర్ సెలవులతో సంబంధం లేకుండా ప్రత్యేక లీవు ఎక్కౌంటు లో పొందుపరుస్తూ, అట్టి కాపీని ఉద్యోగి సర్వీసు పుస్తకం లో జతపరచవలెను.
3. శిశు సంరక్షణ సెలవు హక్కు కాదు. ఇట్టి సెలవు కొరకు సంబంధిత DDO దగ్గర ముందస్తు అనుమతి పొందవలసి ఉంటుంది.
4. మహిళా ఉద్యోగస్తులు సెలవు కాలపు పూర్తి జీతాన్ని పొందుతారు.
5. శిశు సంరక్షణ సెలవును సాధారణ సెలవులు, ప్రత్యేక సాధారణ సెలవులతో కాకుండా వేరే సెలవులతో కలిపి వాడుకోవచ్చును. ప్రస్తుతం అమలులో ఉన్న (180) రోజుల మెటర్నిటి అదనంగా వాటికి కొనసాగింపుగా శిశు సంరక్షణ సెలవును వాడుకోవచ్చు.
ప్రభుత్వ ఉత్తర్వు కాపీని ఇక్కడ పొందగలరు.