About Us

మిత్రులందరికి స్వాగత సుమాంజలి... Welcome to Telangana Mines (తెలంగాణ గనుల సమాచార భాండాగారం)  
మన అందరికి తెలిసిన విషయమే " ఖనిజ సంపద - దేశ సంపద ". ఖనిజాన్ని వీలైనంత ఎక్కువగా వెలికితీసి మానవాభివ్రుద్దికి ఉపయోగించుకోవటం మరియు భావితరాల అవసరాలకు సరిపడేలా ఖనిజాన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత. దీనికి గాను, ఖనిజముల వెలికితీతలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవటంతో పాటు, ఖనిజ అన్వేషణ, వెలికితీతల పై గల కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వముల నియమ నిబందనలు తెలుసుకోవటం, పాటించంటం మనకు అత్యంత అవసరం.

" ఖనిజములు - మానవాళి మనుగడకు (Minerals to Mankind) అను మన పెద్దల నానుడి ని స్పూర్తిగా తీసుకొని, ఖనిజముల అన్వేషణ, వెలికితీత లపై గల అన్ని నియమ నిబంధనలు MM (D&R) Act, 1957, MC Rules, 1960, APMMC Rules, 1966, Forest Conservation Act, 1980, MMR, 1961, IBM Bulitens, EC  & Pollution Control Board Notifications, Updates from Ministry of Mines, Govt. of India, Sand G.O.s, Treasury Head of Accounts మొదలగు అన్ని అనుబంధ శాఖల ముఖ్య సమాచారాన్ని ప్రతి ఒక్కరు ఒకే దగ్గర సులువుగా పొందే విధంగా ఈ వెబ్ సైటును తీర్చిదిద్దడమైనది. సమయానుకూలంగా ప్రతి అంశం ఇందులో చేర్చబడుతుంది. 

ఈ వెబ్ సైటు స్థాపన యొక్క ముఖ్య ఉద్దేశ్యం:

సిరులకు నెలవైన నల్ల బంగారు నేలలో పుట్టిన నేను, గత దశాబ్ద కాలానికి పైగా గనుల శాఖలో చిరుస్థాయి ఉద్యోగిగా సేవలందిస్తూ, ఇటీవలే  భూగర్భ విజ్ఞాన శాస్త్ర్హం పై మక్కువతో ఆ కోర్సు లో చేరి చివరి అంకానికి చేరుకోవడమైనది. ఇటీవల నూతన సంవత్సరం లోకి అడుగు పెడుతున్న సమయంలో ఏదేని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు, నాకు తెలిసిన ప్రభుత్వ శాఖల నియమ నిబంధనలతో పాటు, ఖనిజ విజ్ఞానము పై నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానాన్ని ఇతరులకు పంచాలనే ఆలోచన రావటంతో, ఈ చిన్ని ప్రయత్నాన్ని ప్రారంభించడమైనది. ఇది మీకు ఉపయుక్తంగా ఉంటుందని అశిస్తూ... మీ యొక్క విలువైన సలహాలను, సూచనలను మరియు  సహాయ సహకారాలను అందించగలరని కోరుతూ...

మీ
అడ్మిన్ ...

Give your valuable suggestions / feedback to us throguh email or sms:

venudreamer@gmail.com / telanganamines@gmail.com
Contact:   +91 9059436913
Whatsup: +91 9502713294