DMF

District Mineral Foundation Trust (జిల్లా ఖనిజ ట్రస్టు)


     కేంద్ర ప్రభుత్వం వారిచే జారీచేయబడిన గనులు మరియు ఖనిజములు (అభివృద్ధి మరియు నియంత్రణ) సవరణ చట్టం, 2015 నందలి సెక్షన్ 9(B) ను అనుసరించి, రాష్ట్ర ప్రభుత్వాలు మైనింగ్ వలన ప్రభావితమైన ప్రాంతాల అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కొరకు ఎటువంటి లాభాపేక్ష లేనటువంటి "జిల్లా ఖనిజ ట్రస్టు" ను ఏర్పాటు చేసి దాని విధి విధానాలను రూపొందించుకోవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం "తెలంగాణ రాష్ట్ర జిల్లాల ఖనిజ ఫౌండేషన్ (ట్రస్టు) నియమావళి, 2015 ను రూపొందించి, రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో "జిల్లా ఖనిజ ట్రస్టు"లను ఏర్పాటు చేసింది. ఖనిజ ట్రస్టు ఏర్పాటు పై తెలుగులో సంక్షిప్త సమాచారం మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గెజిట్ ఉత్తర్వులు, ప్రభుత్వ ఉత్తర్వులు, ఖనిజ ట్రస్టు విరాళాల సేకరణ తేది పై గౌరవ సుప్రీం కోర్టు వారి తీర్పు ప్రతులు ఈ క్రింద చూపబడిన లింకు ద్వార పొందగలరు.


Download:
DMF Telugu Note
Government Orders